ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి:పొన్నం

share on facebook

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో రైతుల రుణాలన్నింటిని మాఫీ చేయడమేకాక, సక్రమంగా చెల్లించిన రైతులకు 5 వేల బోనస్‌ ఇచ్చింది నిజం కాదా అని మాజ ఎంపి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.టీఆర్‌ఎస్‌ లక్షరూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు చేస్తున్నదేంటో ప్రజలకు తెలియదా అని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామి నిధులను, కరువు సహాయక నిధులను కూడా దిగమింగుతూ అటు కూలీలను, ఇటు రైతులను నట్టేట ముంచుతున్నాడని, ఇది దివాళా కోరుతనానికి నిదర్శనం కాదా అన్నారు. జిల్లాలో ఎంతమంది వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మానానికి సంబందించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో చూడాలని డిమాండ్‌ చేశారు. నాటి కాంగ్రెస్‌ పాలనను విమర్శించే ముందు ఇంతకాలంగా శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, ఎల్‌ఎండి, నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కాదా అన్నది గుర్తుంచుకోవాలని కేసీఆర్‌ను హెచ్చరించారు.  రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం తెలంగాణాకు చెందిన 7మండలాలను ఒక్క సంతకంతో ఆంధ్రాకు ధారాదత్తం చేస్తుంటే కనీసం నోరుకూడా మెదపలేదని విమర్శించారు.  సమైక్య రాష్ట్రంలోనే కరీంనగర్‌ నంబర్‌ వన్‌గా వరిసాగులో నిలిచిందని అన్నారు. కాంగ్రెస్‌ హాయంలోనే పూర్తయిన ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో రెండు టీఎంసీల నీటిని మంథనికి పంపింగ్‌ చేయడం జరిగిందన్నారు. అప్రాజెక్టును కొంతస్పిల్‌ ఓవర్‌ వర్క్స్‌ పూర్తిచేసి ఉంటే ఎగువన ఉన్న చొప్పదండి, వేములవాడ, నియోజకవర్గాలను నీరు సంవృద్దిగా లభించేవన్నారు. ఎ ఒక్క ప్రాజెక్టుకైనా డీపీఆర్‌ ఉందో బహిర్గతం చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు కడుతూ మెదక్‌కు తరలించుకుపోవడాన్ని కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ఆయన హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి 160 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రాణహిత చేవేల్ల ప్రాజెక్టును రూపొందించామని, దీనికి కేవలం 36 వేల కోట్ల వ్యయం అవుతుండగా దీనికి భిన్నంగా మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేయడంవల్ల అనేక యూనిట్ల విద్యత్‌ అవసరమవుతుండడమేకాక ప్రాజెక్టునిర్మాణ వ్యయం 82 వేల కోట్లకు చేరుతున్నదన్నారు. మేడిగడ్డ వల్ల జిల్లా రైతులకు ఒనగూరే లాభం ఒక్క ఎకరం కూడా లేదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం చేసిందంతా కూడా బోగస్‌ ప్రచారమేనని అన్నారు. ప్రాణహిత రద్దువల్ల నేడు జాతీయ ప్రాజెక్టు ¬దా రాకుండా పోయిందని, ఇది కేసీఆర్‌ అసమర్థతకు ఆనాలోచిత నిర్ణయానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.

Other News

Comments are closed.