మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

share on facebook
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్(జనంసాక్షి):  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్న సందర్భం జిల్లా స్థాయి అధికారులకు ఆయా పనులను అప్పగించామని వాటిని అధికారులందరూ పకడ్భందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులందరూ పూర్తి బాధ్యతతో జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లోని సమవేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి (డీఆర్డీఏ పీడీ) పద్మజారాణి నోడల్ అధికారిణిగా నియమించగా జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) అశోక్‌కుమార్‌కు కలెక్టరేట్ ఆవరణలో, ఆయా ప్రదేశాల్లో మొక్కలు నాటాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్తు శాఖ అధికారులు కరెంట్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని… కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజున ముందస్తుగా జనరేటర్‌ను కూడా సమకూర్చుకోవాలని ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రొటోకాల్ విషయంలో వీఐపీలు, వారికి సంబంధించిన ప్రొటోకాల్ విషయంలో కీసర ఆర్డీవో రవి వ్యవహరిస్తారని ఈ విషయంలో వీఐపీలకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి కలెక్టరేట్ భవనంతో పాటు ఆవరణ మొత్తం శానిటైజేషన్, చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా పూర్తి బాధ్యత వహించాలని ఉద్యానవనశాఖ అధికారిణి నీరజా గాంధీ కలెక్టరేట్ చుట్టుపక్కల అందమైన పూలమొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సీఎం వచ్చే మార్గం నుంచి కలెక్టరేట్ వేదిక వరకు అందమైన రకరకాల పూలమొక్కలతో అలంకరించాల్సిందిగా కలెక్టర్ హరీశ్ సూచించారు. ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి వేదికకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, ఐ &పి ఆర్  అధికారులు మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లను చూడాలని, డీఎస్వో అధికారులు టీ, స్నాక్స్ తదితరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ వివరించారు. ఈ విషయంలో అధికారులకు అప్పగించిన బాధ్యతలను ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాల్సందిగా కలెక్టర్ హరీశ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈ అండ్ సీ గణపతిరెడ్డి, ఇంటలీజెన్స్ ఎస్పీ ఎన్.వి.కృష్ణారావు ,జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి (డీఆర్డీఏ పీడీ) పద్మజారాణి, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస్, ఎస్ఈ శ్రీనివాసరావు, ఉద్యానవనశాఖ అధఙకారి నీరజాగాంధీ, , తూముకుంట మునిసిపల్ చైర్మన్ ,కే రాజేశ్వర రావు ,  అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు
 

Other News

Comments are closed.