ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

share on facebook

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.శశిధర్‌ రెడ్డి అన్నారు. నాకెవరన్నా భయం లేదు. నేను రాహుల్‌కీ భయపడను, మోడీకీ భయపడను అంటూనే ప్రజాగ్రహం పెరుగుతుందన్న భయంతోనే ముందస్తుకు సిద్ధమయ్యారని అన్నారు. పైకి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేదే లేదని బింకం ప్రదర్శిస్తున్నా, ఆచరణలో కెసిఆర్‌ చేస్తున్నదదేనన్నారు. ఓ వైపు కేంద్రానికి లోపాయకారిగా మద్దతు ఇస్తూ పైకి బిజెపికి వ్యతిరేకమని చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించి ముందే ఎన్‌ఇనకలు ఎందుకు వెళుతున్నారో చెప్పాలన్నారు. జమిలి ఎన్నికలు జరపాలనుకుంటున్న బజిఎపి కెసిరా/-/-కు అనుకూలంగా ఎందుకు మారిందో కూడా చెప్పాలన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికలలో బిజెపికి మద్దతు పలికి, జిఎస్‌టికి, నోట్ల రద్దును స్వాగతించి తాను బిజెపికి ఆమడ దూరంలో ఉన్నానని చెబితే ప్రజలు నమ్మరన్నారు. పెట్రోధరలపై కెసిఆర్‌ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు.నిజంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కెసిఆర్‌ చాటి చెప్పాలనుకుంటే కేంద్రాన్ని నిలదీయాన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకు ముందస్తుకు సిద్దమయ్యారని, ఇందులో గుణపాఠం తప్పదన్నారు.

Other News

Comments are closed.