ప్రజారావాణాలో ఆర్టీసీ బెస్ట్‌: మంత్రి

share on facebook

వికారాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా బషీరాబాద్‌ – కంసన్‌పల్లి – తాండూరు బస్సు సర్వీస్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే నవల్గలో రూ.36 లక్షలతో జిల్లా పరిషత్‌ పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన,ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నష్టాల్లో ఉన్నా ఆర్టీసీ ప్రజలకు చేరువగా సేవలు అందిస్తోందని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు వరాలు కురిపిస్తూ వారికి 16శాతం ఐఆర్‌ ఇచ్చారని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.

 

Other News

Comments are closed.