ప్రజావ్యతిరేక పాలనపైనే పోరు: సిపిఐ

share on facebook

జనగామ,అక్టోబర్‌4(జనంసాక్షి):  సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పోరాడుతున్నామని  సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రాజారెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌లో అధి/-కార టిఆర్‌ఎస్‌కు  సిపిఐ మద్దతును  సమర్థించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. అలాగే  తెలంగాణ ప్రజల్లో ఉన్న  ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతామని అన్నారు.  సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు.  ఎన్నికలు, ఉద్యమ సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హావిూని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేటికీ నెరవేర్చలేదన్నారు. అయితే అంతకు మించి కాంగ్రెస్‌ తీరు ఉందన్నారు. గత ఎన్నికల్లో సీట్ల విషయంలో కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడలకు పోయి సిపిఐని అవమానించిన విషయం మరవలేదన్నారు.   తెలంగాణలో సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఐ రాష్ట్ర కమిటీ పోరాటాలు చేస్తోందని అన్నారు. ఇవాళ కాంగ్రెస్‌ నీతులు పలుకుతూ గతాన్ని విస్మరించిదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పోరుబాట సాగుతుందన్నారు.

Other News

Comments are closed.