ప్రజాసేవలోనే ఉంటా: వసంత

share on facebook

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  తాను గెలిచినా ఓడినా ప్రజా సేవలోనే ఉంటానని ,జెడ్పీటీసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తానని లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి మేరెడ్డి వసంత అన్నారు. చిన్నతనం నుంచే ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల అవసరాల కోసం పనిచేసినట్లుగా ఆమె వివరించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలైన పోడు భూములు, ఫారెస్టు భూములు, అంబసత్రం భూములు, కారుకొండ పరిసరాల్లో ఉన్న భూ సమస్యలపై పోరాడేందుకు ఎజెండాగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల మద్దతుతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, గెలుపోటములు సహజమన్నారు.

Other News

Comments are closed.