ప్రతిపక్షాలకు  డిపాజిట్లు కూడా రావు

share on facebook

– పోలవరం ప్రాజెక్టు పనులపై గడ్కరీ క్లిన్‌చిట్‌ ఇచ్చారు
– రాష్ట్ర బీజేపీ నేతలకు అది కనిపించటం లేదు
– తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
అమరావతి, జులై12(జ‌నం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా రావని
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును అభినందించడాన్ని గుర్తు చేస్తూ… గడ్కరీ పోలవరం పనులకు క్లీన్‌ చీట్‌ ఇచ్చినా… రాష్ట్ర బీజేపీ నేతలకు కనబడడం లేదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. విభజన హావిూలు అమలు చేస్తామంటేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. అవసరం తీరాక పొత్తు వద్దని చంద్రబాబు అన్నారని బీజేపీ ఏపీ చీఫ్‌ కన్నా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోనే లేరని సెటైర్లు వేశారు. రాష్టాభ్రివృద్ధికి సాయం చేయకపోవడంతో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుని విమర్శించడమే ధ్యేయంగా కొందరు నేతలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. అసత్య మాటలు మాట్లాడటం ఆపాలని, రాష్ఠాభ్రివృద్ధికి అడ్డుపడకండి అంటూ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు తీసుకురావడంలో దేశంలోనే ఆంధప్రదేశ్‌ ముందంజలో ఉందని బుద్దా వెంకన్న గుర్తు చేశారు.

Other News

Comments are closed.