ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలి.

share on facebook

26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్.
తాండూరు ఆగస్టు 11 (జనం సాక్షి) వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని 26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం 75 వసంతాల స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆజాది క అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం
శుక్రవారం తాండూరు పట్టణం 26వ వార్డు లో ఇంటికి వెళ్లి జెండాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ రఘవేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా
మువ్వన్నెల పతాకాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై జెండాను ఎగురవేయాలని కోరారు. ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్ బసప్ప ,
చందు ,ప్రశాంత్ ,దినేష్ కోటం ప్రసాద్ ,వీరు, శివ మరియు శ్రీనివాస్ బి ఐ వీరన్న జవాన్ అన్నపూర్ణ అ‌ర్ పి ,వ్యాపారులు శ్రవణ్ కుమార్, రఘుపతి రెడ్డి, జగ్ జీవన్ రెడ్డి,తోపాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.