ప్రతి ఒక్కరూ కనీసం 20 మొక్కలు నాటాలి

share on facebook

అప్పుడే లక్ష్యం చేరుకోగలం

కామారెడ్డి,జూలై11(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనాన్ని 33 శాతానికి చేరాలంటే జిల్లాలో ప్రతి ఒక్కరూ 20 మొక్కలు నాటాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా చాలా చోట్ల అడవి తగ్గిపోయింది. . పచ్చదనం కాస్తా కనుమరుగై మైదానాలను తలపిస్తోంది. కామారెడ్డి జిల్లా అంటే ఒకప్పు డు సువిశాల అటవీ ప్రాంతం ఇప్పుడు కాస్తా అడవి హరించుకుపోవడంతో వర్షాలు లేక ఏటా అక్కడక్క డ అల్ప వర్షాపాతం సైతం నమోదు అవుతోంది. అటవీ సంపదను పునరుద్ధరించి ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా లక్షలాది మొక్కలను నాటుతూ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరిసేలా చూస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు కోట్ల మొక్కలు నాటారు. ఈసారి వ ర్షాలు అంచనాలకు తగ్గట్లుగా కురిస్తే నాటిన మొక్క ల్లో 70నుంచి 80శాతం మొక్కలు బతికే వీలుంది. ఈసారి భారీగా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం భారీగా చేపట్టింది. గ్రామాలు, పట్టణాల్లో చైతన్యవంతులైన ప్రజలు మొక్కలు నాటే హరితయజ్ఞంలో భాగస్వాము లైతే హరిత సంకల్పం నెరవేరినట్లేనని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 116 నర్సరీల్లో మొక్కలు పెంచారు. టేకు మొక్కలతో పాటు వివిధ రకాల పూ లు, పండ్ల మొక్కలు, యూకలిప్టస్‌, కానుగ, వేప, జామాయిల్‌ తదితర రకాల మొక్కలు కొద్ది రోజుల్లోనే నాటేందుకు సిద్ధం కా నున్నాయి. గత హరితహారంలో మొక్కలు నాటడంలో కొన్ని శాఖలు విఫలం అయ్యాయనే ఆరోపణలున్నాయి. ఈసారి మా త్రం అలాంటివి పునరావృతం కాకుండా కలెక్టర్‌ పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1.30 కోట్ల మొక్కలు నాటాలని ల క్ష్యంగా నిర్ణయించగా… 116 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నా రు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా నాలుగు కోట్ల మొక్కలు నాటారు. నాటిన మొక్కలను బతికించుకునేందుకు ప్రభు త్వం ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. వానలు సంవృద్ధిగా కురిసే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో నాటిన మొక్కలకు జీవం పోసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. గతేడాది నిర్వహించిన కార్యక్రమంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జిల్లా స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వరకు బాధ్యతారాహిత్యానికి మొక్కల సర్వైవల్‌ రేటు గణనీయంగా క్షీణించింది. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సరైన సమన్వయం చేయడంలో చేతులెత్తేశారు. దీంతో మిగతా శాఖల బాధ్యులకు సైతం అటవీ శాఖ అధికారుల తీరుతో ఇక్కట్లు

పాలయ్యారు.

——————–

Other News

Comments are closed.