ప్రధాని పదవి కుస్తీపోటీ కాదు: జూపూడి ఎద్దేవా

share on facebook

అమరావతి,జూన్‌14(జ‌నం సాక్షి): ప్రధాని పదవి అంటే కుస్తీ పోటీ కాదని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. మోదీ బాడీ ఫిట్‌నెస్‌ అంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని, నాయకులు బాడీ పెంచడం కాదని.. బుర్ర పెంచుకోవాలని సూచించారు. బ్యాంకులను దోచుకున్న వారిని ప్రధాని కాపాడుతున్నారని ఆరోపించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌పై జగన్‌ ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని జూపూడి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ సినిమాలు కాదని, జగన్‌కు నిజమైన సినిమా వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారని హెచ్చరించారు. కన్నా పేరుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని.. అతడు జగన్‌కు ఏజెంట్‌ అని జూపూడి విమర్శలు గుప్పించారు.

 

Other News

Comments are closed.