ప్రపంచవ్యాప్తంగా సాకర్‌ ఫీవర్‌

share on facebook

ఆరంభ వేడుకులకు మాస్కో సిద్దం

భారీగా ఏర్పాట్లు చేసిన రష్య

రష్యా చేరుకుంటున్న దేశవిదేశాల ప్రతినిధులు

మాస్కో,జూన్‌12(జ‌నం సాక్షి): ఇప్పుడు ప్రపంచంలో ఫుట్‌బాల్‌ ఫీవర్‌ పట్టుకుంది. మాస్కో వేదికగా ఈ నెల 14 నుంచి జరుగనున్న సాకర్‌ సంబరాలకు దేశవిదేవాలకు చెందిన వారెందరో రాష్యా చేరకుంటున్నారు. పోటీలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రారంభిస్తారు. ఇకపోతే సాకర్‌ మహా సంగ్రామానికి ఆతిథ్యం ఇస్తున్న రష్యా.. అదిరిపోయే రీతిలో ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కనివినీ ఎరుగని రీతిలో ఫిఫా వరల్డ్‌ కప్‌ ఆరంభోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ప్రస్థానంలో ఓపెనింగ్‌, క్లోజింగ్‌ సెర్మనీలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతిసారి వరల్డ్‌ కప్‌ ఆతిథ్య దేశాలు ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మరీ ఈ వేడుకుల నిర్వహించి తమ ప్రాభవం చాటుకుంటాయి. గత 2014 ఫిఫా వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్‌లో ఓపెనింగ్‌, క్లోజింగ్‌ సెర్మనీస్‌అదర¬ అనిపించాయి. ప్రారంభ వేడుకల్లో పాప్‌ సింగర్‌ పిట్‌బుల్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక 2014 ఫిఫా వరల్డ్‌ కప్‌ ముగింపు వేడుకలు టోర్నీకే హైలైట్‌గా నిలిచాయి. వాకా వాకా సాంగ్‌తో ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని షేక్‌ చేసిన షకీరా.. ఈ వేడుకల్లో ఆడి పాడి ఫ్యాన్స్‌ ను అలరించింది.బ్రెజిల్‌ ఆతిథ్యం ఇచ్చిన 2014 వరల్డ్‌ కప్‌ను మించిపోయే రీతిలో ఈ సారి వేడుకలు నిర్వహించేందుకు రష్యా రెడీ అయింది..! జూన్‌ 14న మాస్కో లోని లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య దేశం రష్యా, సౌదీ అరేబియా మధ్య ప్రారంభ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచి ప్రారంభ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం లుజ్నికి స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. దాదాపు 80 వేల మంది అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఈ ఆరంభ వేడుకను పుతిన్‌ ప్రారంభిస్తారు. రష్యన్‌ సంప్రదాయాన్ని ప్రతిబింబించే రీతిలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఫెలిక్స్‌ మికైలోవ్‌ ఈ వేడుకలను రూపొందిస్తున్నారు. ఓపెనింగ్‌ సెర్మనీలో గ్లోబల్‌ మ్యూజిక్‌ స్టార్‌ రాబీ విలియమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. రాబీ విలియమ్స్‌ తో పాటు, రష్యన్‌ సింగర్‌ గరిఫులిన ఫుట్‌బాల్‌ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఇక బ్రెజిల్‌ మాజీ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ రొనాల్డో కూడా సాకర్‌ వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుకల్లో పాల్గొంటున్నాడు. మొత్తంగా ఎప్పటిలాగే ఈ సారి కూడా ఫిఫా వరల్డ్‌ కప్‌ ఓపెనింగ్‌ సెర్మనీ అంబరాన్నంటనుంది.

 

Other News

Comments are closed.