ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం 

share on facebook

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి):  ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే కూడా మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడమే గాకుండా అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తున్నారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి అన్నారు. గత దశాబ్దకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు వైద్యసేవలు సరిగా అందడం లేదన్నారు. తెలంగానా ప్రభుత్వం పేద ప్రజలపై వైద్యఖర్చుల భారం పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రల్లో ప్రసూతి సంఖ్యను పెంచేందుకు అనేక రాయితీలు ఇస్తున్నారని అన్నారు. కెసిఆర్‌ కిట్‌ పథకంతో పేదలకు నజరానా అందుతోందన్నారు. ఇందుకోసం కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు.అందులో భాగంగా అనేక సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం కల్పిస్తామన్నారు. ఇకనుంచి జిల్లాలోని ఏ ఆసుపత్రిలోను పరికరాలు, యంత్రాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు అందించుటలో కరీంనగర్‌ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుటకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానన్నారు.

Other News

Comments are closed.