ప్రభుత్వ కార్యక్రామలపై విస్తృత ప్రచారం

share on facebook

 

పార్టీ నేతలకు దిశానిర్దేశం

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని ఇటీవల పార్టీ నియమించిన జిల్లా ఇన్‌ఛార్జి నారదాసు లక్ష్మణ్‌ ధీమా వ్యక్తంచేశారు. తెదేపా పని అయిపోయిందని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల్లేక క్షేత్రస్థాయిలో బలహీనంగా మారిందని వివరించారు. తెరాసకు ఎక్కడా ఎదురులేదని చెప్పారు.

సిఎం కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాల కారణంగా బంగారు తెలంగాణ దిశగా దూసుకుని పోతోందని అన్నారు. మిషన్‌ కాకతీయత, మిషన్‌ భగీరథ, కళ్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఇదిలావుంటే ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లాలని ప్రణాళిక చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త ప్రచారం చేసేలా వ్యూహాత్మకంగా ముందుకుపోనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసగృహంలో ఉమ్మడి జిల్లా కీలక నేతల సమావేశంలో పలు అంశాలను చర్చించారు. త్వరలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం ఏర్పాటుచేసి తెలుగు

మహాసభల అనంతరం మంచిర్యాల జిల్లాలో పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు త్వరలో ప్రారంభించాలని చర్చించారు. ఈ సమావేశాల్లో కార్యకర్తలకు సూచనలు చేయనున్నారు. పార్టీ ముందుకు వెళ్లేలా పలు సూచనలు చేయడంతో పాటు కెసిఆర్‌ ఆదేశాల మేరకు ముందుకు వెళ్లేలా మారగనిర్దేశనం చేశామని అన్నారు. జిల్లా మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బేధభావాలు లేకుండా నాయకు లందరిని సమన్వయం చేసుకొని ముందుకుపోవాలని తీర్మానించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయనే విషయాన్ని సమావేశంలో గుర్తుచేసుకున్నారు. కార్యకర్తలందరికి ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వేలాది మంది లబ్ధి పొందుతున్న దాన్ని సరిగ్గా ప్రచారం చేయలేకపోతున్నామన్న భావన నేతల్లో వ్యక్తం అయ్యింది. గ్రామాల వారిగా లబ్ధిపొందిన వారి జాబితాతోపాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తేనే ప్రయోజనం ఉంటుందని సూచించారు. దీనికోసం అధికారిక లెక్కల జాబితాలు మండలాలు, గ్రామాల వారిగా అందజేయనున్నారు. తరచూ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు.

————–

 

—————

 

——

 

————–

 

Other News

Comments are closed.