ప్రాజెక్టులతో భవిష్యత్‌కు పునాది పడాలి

share on facebook

సోమవారం 5-6-2018

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం భవిష్యత్‌లో రైతులకు వరప్రదాయిని కానున్నాయి. ఇరు రాష్ట్రాల్లో రైతుల కోసం, నీటి సంరక్షణ కోసం చేస్తునన కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇవ్వబోతున్నాయి.పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమ పట్నం,హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు ఎపి ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. ఎపి ఉ మ్మడిగా ఉండగా ఇలాంటి ప్రాజెక్టుల ఊసులేకుండా పోయింది. విభజన తరవాత నష్టపోయామన్న వాదనలు పక్కన పెట్టి అభివృద్దికి బాటలు వేసుకోవాలి. అలాగే తెలంగాణలో కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు పెద్దగా ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. చెరువుల గురించి ఆలోచన చేయలేదు. రైతుల గురించి మాట్లాడలేదు. ఈ దశలో ఇక్కడ జరుగుతున్న కార్యకరమాలు యావత్‌ దేశానికి తలమానికంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల గోదావరి, కృష్ణ జలాలు ఇరు రాష్ట్రాల అవసరాలు తీర్చునున్నాయి. గోదావరి జలాల వృధాను అరికడితే ఇరు రాష్ట్రాల నీటి దారిద్యం తీరగలదు. కర్నాటక తరహాలో ఆల్మట్టి,నారాయణపూర్‌ లాంటి జలాశయాలపై ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలు దృష్టి సారించాలి. ప్రాజెక్టుల ద్వారా సముద్రంలో కలిసే వృధానీటిని అరికట్టాలి. నదుల అనుసంధానంపైనా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలి. లేకుంటే ప్రస్తు వర్షాభావ పరిస్థిలను చూస్తే వ్యవసాయంతో పాటు, తాగునీటికి కూడా దుర్భర పరిస్థితులు ఏర్పడ గలవు. తెలంగాణలో కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ లాంటి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. నీటిని ఆదా చేసుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు చెరువులను కాపాడుకుంటూనే వర్షాకాలం లేదా తుఫాన్ల సమయంలో వచ్చే వర్షాలతో నీటిని నింపుకోవాలి. లేకుటే భవిష్యత్‌ దుర్భరంగా మారగలవు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఉన్నా నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం లేకపోతోంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఓ వైపు మొక్కల పెంపకం, మరోవైపు వాతావరణంకాపాడుకునే స్థితులను సృష్టించుకోకుంటే రాబోయే తరాలు క్షమించవు. ఏటా వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. తొలకరిలో కొంత ఊరించిన వర్షాలతో గత వైభవం వస్తుందని సంతోషించిన రైతుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మిషన్‌ కాకతీయ, కాళేశ్రం, సీతారామ తదితర ప్రాజెక్టుల వ్‌ల్ల రానున్న కాలంలో నీటి అవస్థలు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్‌ఇన సిఎం కెసిఆర్‌ కూడా పదేపదే చెబుతున్నారు. నిరంతరం నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. నలుగురికి అన్నం పెట్టే అన్నదాతతో ప్రకృతి ఆటాడుకుంటుంది. ఖరీఫ్‌ ఆరంభంలో వరుణుడి కరుణతో పుష్కలంగా వానలు పడడంతో అన్నదాత రెట్టించిన ఉత్సాహంతో సాగును ప్రారంభించడం, తరవాత నమ్ముకున్న వరుణుడు ముఖం చాటేయడంతో కర్షకుడి ఆశలు ఆవిరవుతున్నాయి. నేలరాలని చినుకులు, మండుతున్న ఎండలతో పంటలు నిలువునా ఎండిపోతుంటే కన్నీరు మున్నీరవుతున్నాడు. నాలుగు చినుకులు పడినా పంటలు వేద్దామని దుక్కులు దున్ని భూములను సిద్ధం చేయగా రాలని చినుకులతో వేల ఎకరాలు బీడు భూములుగా మారుతున్నాయి. ఏటా వస్తున్న కష్టాలను దిగమింగుకుని వేలకు వేలు అప్పులు తెచ్చి పంటలు వేస్తే చినుకు లేక పంటలు ఎదుగుబొదుగు లేకుండా ఉంటున్నాయి. వానదేవుడా కరుణించు అంటూ అన్నదాత ఆకాశం వైపునకు చూస్తున్నా ఫలితం కానారాని పరిస్థితులు పోవాలి. సరైన నీటివనరులు లేకపోవడంతో ఏటా రైతులకు పంటల సాగులో నష్టాలు తప్పడం లేదు. అన్నదాతల్లో సన్నచిన్నకారు రైతులే అధికం. ఎకరం రెండు ఎకరాలు సాగు చేసుకుని జీవిస్తున్న గిరిజన కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు తీవ్రవర్షాభావం వల్ల ఎండుతున్న పంటలను చూసి లబోదిబోమంటున్నాయి.క్లళెదుటే పంటలు వాడిపోతున్నా ఏవిూ చేయలేక నిస్సహాయ స్థితిలో మగ్గుతున్నారు. పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని అంచనా చేసిన అన్నదాతలు ఏటా వానలు ముఖం చాటేయడంతో ఆందోళనలో పడిపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నా చివరికి చేతికందేది ప్రశ్నార్థకమే. రెండేళ్లుగా కరవు నెలకొనడంతో భూగర్భ జలాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ దశలో వ్యవసాయం కోసం దీర్ఘకాలికప్రణాళికలు వేయాల్సిన అవసరాన్ని ఏలికలు గుర్తించాలి. సాగును గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. వృధానీటికి అడ్డుకట్ట వేసేలా చిన్నచిన్న రిజర్వాయర్లను నిర్మించుకోవాలి. అప్పుడే వర్షాభావంనుంచి బయటపడగలమని గుర్తుంచు కోవాలి. సాగుతాగునీటికి శాశ్వత ప్రణాళికలే దేశానికి శ్రీరామరక్షగా గుర్తించాలి. ఆ మేరకు కార్యాచరణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న పనులు లేదా కార్యాచరణ రైతాంగానికి శాశ్వతంగా నీటి సమస్యలను దూరం చేసేదిగా ఉన్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఘంటాపథంగా నీటి అవసరాలు తీర్చబోతున్నామని స్పస్టం చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా సాగుతున్న పనులు సత్ఫలితాలు ఇవ్వనున్నాయి. కాళేశ్వరం ,మల్లన్నసాగర్‌ అందుబాటులోకి వస్తే భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. గోదావరిలో వరద వచ్చినప్పుడు పోలవరం ద్వారానీటికి అడ్డుకట్ట పడగలదు. ఇలాంటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం మాత్రమే మన అవసరాలను తీర్చగలవు.

 

Other News

Comments are closed.