ప్రాదేశికంలోనూ మహిళలకే పెద్దపీట

share on facebook

రిజర్వ్‌డు స్థానాలకు మించి పోటీ
సర్పంచ్‌ ఎన్నికల్లోనూ మహిళలకే అగ్రస్థానం
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. రిజర్వు స్థానాల కంటే ఎక్కువ చోట్ల మహిళలు పదవులు గెలుచుకుంటున్నారు. రిజర్వు స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి.. విజయం సాధించి తమ సత్తాను చాటుతున్నారు. మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా వల్లకొండ శోభారాణి ఉండగా.. జిల్లాల విబజనతో తాజాగా నాలుగు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేశారు. నాలుగింటా.. మూడు చోట్ల జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులను మహిళలకు రిజర్వు చేశారు. నిర్మల్‌ జడ్పీ చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జడ్పీ పీఠాన్ని ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ పదవిని ఎస్టీ జనరల్‌కు.. మంచిర్యాల జడ్పీ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో మూడు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులు మహిళలకే దక్కనున్నాయి. ఆసిఫౄబాద్‌ను ఇప్పటికే టిఆర్‌ఎస్‌ కోవ లక్ష్మికి కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 66 గ్రావిూణ మండలాలుండగా.. ఇందులో 50శాతం ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. నిర్మల్‌ జిల్లాలో 18మండలాలకుగాను.. 10ఎంపీపీ పదవులు, 9జడ్పీటీసీ స్థానాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15మండలాలకుగాను.. 7ఎంపీపీ పదవులు, 8జడ్పీటీసీ స్థానాలు, మంచిర్యాల జిల్లాలో 16మండలాలకు గాను.. 8ఎంపీపీ పదవులు, 9జడ్పీటీసీ స్థానాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 17మండలాలకుగాను.. 8ఎంపీపీ పదవులు, 9జడ్పీటీసీ స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 567ఎంపీటీసీ స్థానాలుండగా.. వీటిలో 50శాతం ఎంపీటీసీ స్థానాలను మహిళలకు రిజర్వేషన్‌ చేశారు. నిర్మల్‌ జిల్లాలో 156ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 78ఎంపీటీసీ స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. కు మ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 123ఎంపీటీసీ స్థానా లు ఉండగా.. ఇందులో 62స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 158ఎంపీటీ స్థానాలు ఉండగా.. 79స్థానాలు మహిళలకు రిజర్వు చేశారు. మంచిర్యాల జిల్లాలో 130ఎంపీటీసీ స్థానాలకుగాను.. 65స్థానాలను మహిళలకు కేటాయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేయగా.. రిజర్వేషన్‌ స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ స్థానాల్లో గెలిచి.. తమ సత్తాను చాటారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 467గ్రామ పంచాయతీలకుగాను.. 465గ్రామ పంచాయతీల్లో ఎన్నికలయ్యాయి. ఇందు లో 234మహిళలకు రిజర్వు చేయగా.. 249చోట్ల సర్పంచులుగా గెలిచారు. రిజర్వు స్థానాల కంటే 15చోట్ల మహిళలు జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి గెలిచారు.నిర్మల్‌ జిల్లాలో 396గ్రామ పంచాయతీలకుగాను.. 198గ్రామ పంచాయతీలను మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వు స్థానాలకు మించి.. ఎక్కువ స్థానాల్లో మహిళలు పోటీ చేసి విజయం
కూడా సాధించారు. జిల్లాలో 227గ్రామ పంచాయతీల్లో మహిళలు సర్పంచ్‌లుగా గెలిచారు. రిజర్వు స్థానాల కంటే 29స్థానాల్లో అధికంగా మహిళలు సర్పంచ్‌లయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 334గ్రామ పంచాయతీలకుగాను.. 166 గ్రామ పంచాయతీలు మహిళలకు రిజర్వు చేశారు. 169 గ్రామ పంచాయతీల్లో మహిళలే సర్పంచ్‌లుగా గెలవగా.. రిజర్వు స్థానాల కంటే మూడు చోట్ల ఎక్కువగా పదవులు దక్కించుకున్నారు. మంచిర్యాల జిల్లాలో 311గ్రామ పంచాయతీలకుగాను.. 308చోట్ల ఎన్నికలయ్యాయి. 154 గ్రామ పంచాయతీలు మహిళలకు రిజర్వు చేయగా.. 168చోట్ల సర్పంచ్‌ పదవులు దక్కించుకున్నారు. రిజర్వు స్థానాల కంటే 14చోట్ల అధికంగా మహిళలు పదవులు కైవసం చేసుకున్నారు.

Other News

Comments are closed.