ప్రేమ విఫలమైందని సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

share on facebook

– నల్గొండ జిల్లాలో ఘటన
నల్గొండ, జూన్‌26(జ‌నం సాక్షి) : ప్రేమ విపలమైందన్న ఆవేదనతో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కిన సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లిలోని ఓ కళాశాలలో చదువుతున్న నాగార్జున, అదే కళాశాలకు చెందిన యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత నెలలో వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు దేవరకొండ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారిద్దరూ మైనర్‌లు కావడంతో కౌన్సిలింగ్‌ ఇచ్చి మేజర్‌లు అయ్యాక వస్తే వివాహం చేస్తామని తల్లితండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో చేర్పించారు. అప్పట్నుంచి ఆ యవతి నాగార్జునకు ఫోన్‌ చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు.

Other News

Comments are closed.