.ప్రైవేటు కంపెనీల కవిూషన్‌ కోసమే 24గంటల విద్యుత్‌ 

share on facebook

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..
ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధమా?
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ ..
మహబూబాబాద్‌,నవంబర్‌29 (జ‌నంసాక్షి): విద్యుత్‌పై కేసీఆర్‌ కాకమ్మ కథలు చెబుతున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. గతంలో ఉత్పత్తి తక్కువగా ఉండేదని, డిమాండ్‌ ఎక్కువగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువా.. డిమాండ్‌ తక్కువగా ఉందని చెప్పారు. ఇందులో కేసీఆర్‌ ఘనత ఏవిూ లేదని తెలిపారు. కవిూషన్లకు కక్కుర్తిపడి 24 గంటల విద్యుత్‌ ఇస్తూ రైతుల్లో సెంటిమెంట్‌ రాజేస్తున్నారని వివరించారు. ప్రైవేటు కంపెనీల కవిూషన్‌ కోసమే 24గంటల విద్యుత్‌ ఇస్తున్నారని విమర్శించారు. కరెంట్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనివేనన్నారు. కేసీఆర్‌ ఒక్క యూనిట్‌ విద్యుత్‌ అయినా అదనంగా ఉత్పత్తి చేశారా? అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో ప్రైవేటు కంపెనీలపై రూ.వేల కోట్ల భారం పడిందన్నారు. ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Other News

Comments are closed.