ఫలించిన ఎంపి కవిత ప్రయత్నం

share on facebook

నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఉత్తర్వులు జారీచేసింది.మూడేళ్ల కిందటే బోధన్‌ కు కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా, తాజాగా నిజామాబాద్‌ కు మంజూరు అయింది. 4 ఏళ్లలో ఒకే జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కావడం విశేషం. ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పటి హెచ్‌ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ, ప్రస్తుత మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ లకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అవశ్యకతను తెలుపుతూ లేఖలు రాశారు. వ్యక్తిగతంగాను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో వారు స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

Other News

Comments are closed.