ఫిబ్రవరి 18న జమ్మూలో ఆమ్రపాలి పెళ్లి

share on facebook

వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి కాట పెళ్లి వచ్చేనెల 18న జమ్మూలో జరుగనుందని సమాచారం. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడి కావడంతో జిల్లాలో వరుడు ఎవరన్న ఆసక్తి నెలకొంది.  ఎప్పటి నుంచో తెలిసిన విషయమే అయినా ఉన్నట్టుండి ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌ అయింది. యూత్‌ ఐకాన్‌గా అతి తక్కువకాలంలో అందరూ భావించే కలెక్టర్‌ అమ్రపాలి కాట పెళ్లి ఫిక్స్‌ అయింది. 2011బ్యాచ్‌కు చెందిన ఢిల్లీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సవిూర్‌ శర్మతో ఆమెకు ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  సవిూర్‌ శర్మతో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 18న జమ్మూలో పెళ్లి చేసుకున్న తరువాత 23న వరంగల్‌ కలెక్టర్‌ బంగ్లాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్టు సమాచారం. అయితే 25న హైదరాబాద్‌లో కూడా గెట్‌ టు గెదర్‌ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట వరంగల్‌లో పనిచేసిన కాలంలోనే ఆమె ఓ ఇంటి వారు అవుతోండటం విశేషం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మాత్రం ప్రకటించలేదు. అలాగే వస్తున్న వార్తలను ఖండించలేదు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వెలువరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.మొత్తంగా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన యువ ఐఎఎస్‌ పెళ్లి ఇప్పుడు స్థానిక ప్రజల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Other News

Comments are closed.