ఫిరాయింపులు కాంగ్రెస్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా

share on facebook

దత్తాత్రేయ ఇంట్లో కూర్చుంటే మంచిది
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  దేశంలో ఉగ్రవాదం పెరగడానికి బీజేపీనే కారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి అంశాన్ని ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం తగదన్నారు. దత్తాత్రేయ రిటైర్‌ అయి ఇంట్లో కూర్చొవాలని ఎద్దేవా చేశారు. సోమవారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. విపక్ష నేతలపై ఫైర్‌ అయ్యారు. పెద్ద మేధావుల్లా ఉత్తమ్‌, భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు.. ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. బ్యాలెట్‌ అయితే బాగుంటుందని మాట్లాడుతున్న ఉత్తమ్‌… ఈవీఎంలతో కాంగ్రెస్‌ గెలవలేదా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.  మతాన్ని అడ్డం పెట్టుకొని భాజపా రాజకీయం చేస్తోందని, ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. అభినందన్‌ను వదలకపోతే పాక్‌కు కాలరాత్రేనని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని, భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రధాని బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. ప్రతి అంశాన్నీ ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం భాజపా నేతలకు తగదన్నారు. ఇవీఎంలతో ఉత్తమ్‌ గెలవలేదా అని ప్రశ్నించారు. 17 ఎంపీ స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. కనీసం తమకు పోటీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై కాంగ్రెస్‌ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలని వ్యాఖ్యానించారు. తమ పాలన బాగుంటేనే ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు. ఇంటర్‌ ఫలితాలపై ప్రభుత్వం కమిటీ వేసిందని, కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టంచేశారు.  ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి తెలిపారు. దేశం గర్వపడేలా రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఇటీవల ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ పట్టుకుందని గుర్తుచేశారు.

Other News

Comments are closed.