ఫిలిప్పిన్స్‌లో భూకంపం

share on facebook

– ఫసిఫిక్‌ తీరంలో సునావిూ హెచ్చరికలు
– వణికిపోతున్న తీర ప్రాంతాల ప్రజలు
ఫిలిప్పిన్స్‌, డిసెంబర్‌29 (జ‌నంసాక్షి) : ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 11.39 గంటల సమయంలో దక్షిణ ప్రాంతంలోని మిందానావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. రికర్ట్‌ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.9గా నమోదైందని తెలిపింది. మిందానా ద్వీపంలోని దావో పట్టణానికి ఈశాన్యంలో 120 మైళ్ల దూరం, పుండాగుటిన్‌ నగరానికి 62 మైళ్ల దూరంలో భూప్రకంపనలు సంభవించినట్లు తెలియజేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోవిూటర్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాల్లో సునావిూ వచ్చే ప్రమాదముందని పసిఫిక్‌ సునావిూ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయితే అమెరికాలోని హవాయి ద్వీపానికి మాత్రం సునావిూ ముప్పేవిూ లేదని స్పష్టంచేసింది. ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియా దీవులకు కూడా సునావిూ హెచ్చరికలు జారీచేశారు. తొలుత భూకంప తీవ్రతను రికర్ట్‌ స్కేల్‌పై 7.2గా పేర్కొన్న అమెరికా జియోలాజికల్‌ సర్వే, తర్వాత ఇది 6.9 నుంచి 7 గా ఉన్నట్టు పేర్కొంది.
తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 2 గంటల వరకు సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్‌ అగ్నిపర్వత, సిస్మాలజీ సంస్థ తెలిపింది. సాధారణం కంటే అలలు కొన్ని ఎడుగుల ఎత్తులో విరుచుకుపడతాయని ఈ నేపథ్యంలో అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరికల తీవ్రతను బట్టి ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. భూకంపం వల్ల జరిగిన నష్టం గురించి అధికారులు ఇంకా వివరాలను వెల్లడించలేదు. డిసెంబరు 22న ఇండోనేషియాలో క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవ్వడంతో భారీ సునావిూ సంభవించి దాదాపు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనేక మంది గాయపడగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

Other News

Comments are closed.