ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

share on facebook

నిజామాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. పేదవిద్యార్తులను ఇప్పటికీ టిసిలు ఇవ్వకుండా, హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ఘటనలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ తదితరాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడిన ప్రభుత్వం, బడుగుల పిల్లల చదువుల కోసం ఫీజుల బకాయిలు చెల్లించేందుకు వెనకాడుతోందన్నారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదని గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చింది. ఫీజు బకాయిల చెల్లింపును నిర్లక్ష్యం చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దన్నారు. ఉచిత విద్యను అందిస్తానంటున్న సిఎం కెసిఆర్‌ విద్‌ఆయర్తుల ఫీజుల చెల్లింపులో ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

Other News

Comments are closed.