ఫ్యూడల్‌ పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్యం గురించి ఆలోచనలా!

share on facebook

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో దొరల ప్రభుత్వం కావాలో… ప్రజాప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అంటున్నారు. తాను ఉంటున్న కాంగ్రెస్‌ పార్టీలోనే దొరల పెత్తనం ఉందన్న విషయం ఆయన తేల్సుకోలేక పోతున్నారు. కాంగ్రెస్‌లో ఆదినుంచి రెడ్ల పెత్తనం కొనసాగుతోంది. ఆ పార్టీలో అనువంశిక పెత్తనం ఆచారంగా వస్తోంది. అయినా అందులో ఉంటూనే ఆయన పోరాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో భట్టి లాంటి వారిని పిసిసి అధ్యక్షుడని చేసి సిఎంగా చేస్తామని ప్రకటించగలరా అన్నది గమనించాలి. ఆత్మ గౌరవం కోసం అందరూ ఐక్యమై నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చిన భట్టి కాంగ్రెస్‌లో ఏ మాత్రం ప్రాధాన్యం ఉందో గమనించాలి. అయినా భట్టి తన ప్రయత్నాన్ని వీడకుండా పోరాడడం అభినందనీయం. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజాసంఘాలు, విద్యార్థులు, రైతులు, బీసీలు, దళి తులు, గిరిజనులు, మహిళలు ఏకతాటిపైకి రావాలని కోరుతున్నా. గాంధీ కుటుంబం, రాహుల్‌నుద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘తెలంగాణను ఇచ్చిన సోనియాను అమ్మా.. బొమ్మా అని అన్న కొడుకు కేటీఆర్‌, రాహుల్‌ను బఫూన్‌ అన్న తండ్రి కేసీఆర్‌ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థమైందంటున్నారు. అధికారంలోకి వచ్చే అవకాశమున్నా ఇతరులను ప్రధానిని చేసిన ఘనత సోనియా కుటుంబానిదని గుర్తుచేశారు. 100 సీట్లు గెలుస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల నెందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. రాహుల్‌ను కాదని పార్టీ అధ్యక్షపదవి మరొకరు చేపట్టలేరు. రెడ్డిలను కాదని పిసిసి అధ్యక్ష బాధ్యతలను మరొకరు చేపట్టలేరు. అయినా పాపం భట్టిలాంటి వారు తమ అవసరాల కోసం కాంగ్రెస్‌ లాంటి పార్టీలో మనుగడ సాగించక తప్పడం లేదు.

Other News

Comments are closed.