బంగారు తెలంగాణ పేరిట మోసం

share on facebook

నల్లగొండ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడ గట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకోప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని డిసిసి అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్‌ అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్నారు. అనేక మందికి జీతాలు రావడం లేదనీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం లేదనీ, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల తెరాస పాలన ఇంత అధ్వాన్నంగా ఉంటే మరో మూడేల్లు ఇంకెంత దారుణంగా ఉంటుందో చెప్పలేమన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో బంగారు పంటలు పండే భూములు బంజర్లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్‌ తదితర ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణతో రైతులను ముంచుతున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పండుగల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. రైతులకు విత్తనాలు అందజేసే స్థితిలో తెరాస ప్రభుత్వం లేదనీ, రైతుల బతుకులు ఛిద్రం అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రిజర్వేషన్ల పేరిట ముస్లింలను, ఎస్టీలను మోసగిస్తున్నారని ఆరోపించారు.

 

Other News

Comments are closed.