బంగారు తెలంగాణ లక్ష్యం

share on facebook

కార్యక్రమాల అమలులో ప్రత్యేకత: ఎమ్మెల్యే
సిద్దిపేట,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని దుబ్బాక  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పోరాడి సాధించుకన్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దడంలో అందరం కలిసి పని చేద్దామని అన్నారు.  హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. అన్నికార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై బంగారు తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని  అన్నారు.  విద్యార్థుల్లో నూతన చైతన్యం వచ్చిందని స్వచ్ఛందంగా విద్యార్థులంతా టీఆర్‌ఎస్వీలో చేరుతున్నారని, స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సైనికునిల్లా పిడికిలి బిగించి బంగారు తెలంగాణ కు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యారంగానికి వేలాది కోట్లు కేటాయిస్తూ మౌళిక సదుపాయాల కోసం పెద్దపిట వేసిందన్నారు. తెలంగాణలో మరెక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అత్యాధునిక మౌళిక సదుపాయాలు కల్పించిందని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం పెట్టిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కుల, చేతి వృత్తుల బలోపేతం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భూపరమైన సమస్యలతో రైతులు ఇబ్బందులకు గురికావద్దనే లక్ష్యంతో రెవెన్యూ అధికారులను నేరుగా గ్రామాలకే పంపించి సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేస్తోందన్నారు.  ప్రతీ రైతుకు పంటలకు సాయంగా ఎకరానికి రెండు పంటలకుగాను రూ. 8 వేలు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. తాజాగా రైతుబీమాతో వారికి భరోసా కల్పించిందన్నారు.  అధికారులు పకడ్భందీగా సర్వేలు పూర్తి చేసి వందశాతం రైతులకు మేలు జరిగే విధంగా పాటుపడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకంతో గ్రామాల్లోని పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అసంపూర్తి భగీరథ పనులు పూర్తి చేయాలని సంబందిత అధికారులను కోరారు.

Other News

Comments are closed.