బతుకమ్మ చీరల ప్రదర్శన

share on facebook

ఖమ్మం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఖమ్మం నగరంలోని 12 కేంద్రాలలో బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 12 వరకు నగరంలోని 50 డివిజన్లలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Other News

Comments are closed.