బలమైన నేతలకే జిల్లా బాధ్యతలు

share on facebook

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు 
హైదరాబాద్‌,మే17(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్న కాంగ్రెస్‌ అందుకు అనుగుణంగా డిసిసిలను పటిష్టం చేసే పనిలో పడింది. కార్యకర్తల్లో విశ్వాసం నింపి వారిని ముందుకు నడిపించే వారినే అధ్యక్షులుగా ఎంపిక చేస్తారని సమాచారం. జిల్లాల పునర్విభజన అనంతరం కొత్త అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది.  అన్ని అంశాలను పరిశీలించి పార్టీని ముందుండి నడిపించే వారికే నాయక్తంవ బాధ్యతలు అప్పగించనున్నట్లు  నేతలు చెబుతున్నారు. అయితే సీనియర్లు మాత్రం  ఎవరికివారు అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కవ చోట్ల అధ్యక్షులుగా ఎంపికయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశానికీ ప్రాధాన్యం ఇచ్చి నియామకాలు చేపట్టనున్నారు. జిల్లాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో జిల్లా ముఖ్యనేతల సిఫార్సులు కీలకంగా మారనున్నాయి. ఈ విషయంలో ఇతర ముఖ్యనేతలూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఆయా ప్రాంతంలో బలమైన నేతగా పేరున్న వారి అభిప్రాయాలను తసీఉకుని ముందుకు సాగాలని చూస్తున్నారు. అయితే అన్ని జిల్లాలో కూడా పోటీ విపరీతంగానే ఉంది. సీనియర్‌ నేతలు పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి.పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఇక పార్టీలో సుధీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని మరికొందరు సిఫార్సు చేస్తున్నారు. మొత్తంగా డిసిసిలను బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సన్నద్దంచేయాలని చూస్తున్నారు.

Other News

Comments are closed.