బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

share on facebook

మేడ్చల్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఘట్కేసర్‌ నుండి కీసరకు వేళ్ళు బస్సు సర్వీసులు తక్కువున్నాయంటూ ఘట్కేసర్‌ బస్టాండ్‌ సెంటర్లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఇక్కడ ఉన్న వివిధ ఇంజనీరింగ్‌ ఫార్మసీ విద్యార్థులకు అనుగుణంగా బస్సులు వేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్న అతికోద్ధి బస్సులను కిసరకు వెళ్లే బస్టాప్‌ లో బస్సులు ఆపకుండా వెళ్తున్నారని, తక్కువ సర్వీసుల వలన వేలాడుకుంటు వెల్లే పరిస్థితిలో ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన ధర్నా నిర్వహించారు. గతంలో ఎన్నిసార్లు నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఘట్కేసర్‌ ఇన్స్పెక్టర్‌ సర్దిచెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

 

Other News

Comments are closed.