బస్సు ఢీకొని వృద్దుడు మృతి

share on facebook

విజయవాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా కంచికచర్ల జాతీయ రహదారిపై పెట్రోల్‌ బంకు సవిూపంలో ఓ వ్యక్తిని శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తలారి గాబ్రియేలు అనే వృద్ధుడు మృతి చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే గాబ్రియేలు మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.  చందర్లపాడు మండలం కాసరబాద వద్ద కృష్ణానదిలో దిగి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బతుకమ్మలతో పాటు నదిలోకి స్నానానికి వెళ్లిన కొత్తపల్లి గోపికృష్ణా గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు గోపీకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇంకా ఆచూకీ దొరకలేదు. కాగా గల్లంతయిన గోపీకృష్ణ చందర్లపాడుకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది.

Other News

Comments are closed.