బస్సు ఢీకొని వ్యక్తి మృతి

share on facebook

మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన  శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కల గ్రామం చాకరిమెట్ల సవిూపంలో లక్ష్మాపురం రోడ్డుపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన వ్లలెపు యాదగిరి(50) తన ద్విచక్ర వాహనంపై గుమ్మడికాయల మండలం కొత్తపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చాకరిమెట్ల సవిూపంలోని లక్ష్మాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న నర్సాపూర్‌ డాన్‌ బాస్కో పాఠశాల బస్సు ఆయన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Other News

Comments are closed.