-బహుజన రాజ్యాధికారమే మా ఎజెండా.

share on facebook

-బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి.

-బీసి సంఘం ఆధ్వర్యంలో ఎర్రసత్యం 27వ వర్ధంతి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు12(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసి సంఘం ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజక వర్గ ఎమ్మెల్యే దివంగత ఎర్రసత్యం 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి ఆధ్వర్యంలో ఎర్రసత్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే దివంగత ఎర్ర సత్యం బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని రాజ్యాధికారంలోను విద్య. ఉద్యోగ, ఆర్థిక రంగంలోనూ జనాభా దామాషా ప్రకారం సమాన వాట ఉండాలని బీసీలను రాజకీయ చైతన్యం చేస్తూ ఎమ్మెల్యే పదవిలో ఉండి నియోజకవర్గానికి పేదలకు ఇండ్లు గాని, ఇంటి స్థలాలు గాని ఇవ్వడం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు.బడుగు, బలహీన వర్గాల్లో ఎంతో అభిమానం సంపాదించు కున్న మంచి నాయకుడు ఎర్ర సత్యం అని కొనియాడారు. ఎర్ర సత్యం ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక సామాజిక వర్గం ఆదిపత్యం కోసం బీసీలు ఎదగకుండా కుట్ర చేసి1995లో ఆగస్టు12న చంపారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎర్ర సత్యం చేసిన సేవలకు ప్రజలలో చెరుపలేని ముద్ర వేసుకున్నారని ఇప్పటికి ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయన్నారు.ఎర్ర సత్యం ఆశయాలను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీసీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే విధంగా ఓటు చైతన్యం చేస్తూ నాయకులను తయారు చేస్తామని,బీసీ బహుజన రాజ్యం తీసుకురావడమే మా ఎజెండా అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ల నిరంజన్. తాలూకా ప్రచార కార్యదర్శి కొట్ర శీను. పరమేష్. విద్యార్థి సంఘం నాయకులు రాజు గౌడ్. మహేష్. నవీన్. దివాకర్ గౌడ్. నాగరాజు. నరేందర్. నితిన్ యాదవ్. భూపతి ముదిరాజ్. శ్రీను. గణేష్. పాండు. దిలీప్. శ్రీకృష్ణ. యాదయ్య. తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.