బాబు అధ్యక్షతన కేబినేట్‌ భేటీ

share on facebook

అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం మంగళవారం నాడిక్కడ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో.. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి, తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. 1954కు ముందు కేటాయించిన అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణతో పాటు, ఇనాం భూముల సమస్య, ఇతర అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కడపలో 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. దొనకొండలో మెగా పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనుంది.

 

Other News

Comments are closed.