బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచార యత్నం

share on facebook

రంగారెడ్డి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) :  జిల్లాలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై కానిస్టేబుల్‌ శేఖర్‌ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్‌ను చేవేళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శంకర్‌పల్లికి చెందిన వడ్డే శేఖర్‌ కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Other News

Comments are closed.