బాలికల్లో మానసిక ధైర్యం నింపేలా చర్యలు

share on facebook

జనగామ,జనవరి18(జ‌నంసాక్షి): రాష్ట్రంలోనే తొలిసారి బాలబాలికల్లో మానసిక, శారీరక వికాసానికి ఉపయోగపడే శిక్షణను ప్రారంభించారు. దీనిని నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోబోతున్నారు. సమాజంలో ప్రతికూల శక్తులను ఎదుర్కొనేలా వారిలో ధైర్యసాహసాలు నింపేందుకు ఆత్మరక్షణ విద్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇది ఉపయోగపడనుంది. జనగామ కలెక్టర్‌ ఆదేశాలను అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ పూర్తిచేసుకున్న వారు తమ శక్తిని, నైపుణ్యాలను ప్రదర్శింప చేసేలా కలెక్టర్‌ యోచిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలు, గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, కస్తూర్బా గాంధీ పాఠశాలల విద్యార్థినులు ఈ ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలన్నారు. ప్రదర్శన ప్రాంగణంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స బృందం, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.విద్యార్తులు ఎంత మంది పాల్గొనేది పాఠశాలల వారీ నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతి బృందానికి ఒక ఉపాధ్యాయురాలిని బాధ్యులుగా నియమించాలని కోరారు.

Other News

Comments are closed.