బిజెపిని బలోపేతం చేస్తాం

share on facebook

నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):

బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం బిజెపి కార్యకర్తలపై ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపుమేరకు పార్టీని ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. భారతదేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమవుతుందని అన్నారు. అందుకోసం ప్రతి బూత్‌ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అన్నారు. భాజపాని అణచివేయాలని కుహనా లౌకికవాదులు ప్రయత్నించినప్పటికీ వారు సఫలం కాలేరని తెలిపారు. కులం, మతం, భాష, ప్రాంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టే తత్వాన్ని వీడాలని  హితవు పలికారు. ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని మరోమారు స్పస్టం చేశారు.  సర్కారు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నిస్తోందని, రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిర్ణయంపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

Other News

Comments are closed.