బిజెపి ఆశలన్నీ అసమ్మతులపైనే

share on facebook

ఆ ఐదు సీట్లు దక్కుతాయన్నదా అన్నదే అనుమానం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌10 జ‌నంసాక్షి: అన్ని పార్టీల్లో ఉన్న అసమ్మతే బిజెపి బలమని నేతలు భావిస్తున్నారు. అసమ్మతి నేతలను పిలిచి టిక్కెట్లు ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారు. గత నాలుగేళ్లలో బిజెపి కేంద్రంలో అధికరాంలో ఉన్నా ఏ నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థిని తయారు చేసుకోలేకపోయింది.

మోడీ ప్రభుత్వ పని తీరు భేషుగ్గా ఉందని చెప్పుకుంటున్నారు. అంతకుమించి పెద్దగా వారు సాధించిందేవిూ లేదు. ఇప్పుడున్న ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఏది గెలు/-తారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపితో జతకట్టడం ద్వారా ఐదుసీట్లు గెలవగలిగారు. జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేసిన కెసిఆర్‌ మళ్లీ ఎందుకు మాట మార్చారని లక్ష్మణ్‌ వాపోతున్నారు. జాతీయ స్థాయిలో శరవేగంగా మోడీ గ్రాఫ్‌ పడిపోతున్నది. అటువంటి పార్టీతో కలిసి జమిలి ఎన్నికలలో పాల్గొంటే తన భవిష్యత్తు చిక్కుల్లో పడొచ్చన్న భావనలో కెసిఆర్‌ ఉన్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ జాతీయంగా కొంత పుంజుకుంటు న్నందున తెలంగాణలో తనకు ఇబ్బందులు పెరగొచ్చన్న భయం కూడా ఉండివుంటుంది. తన చర్య ద్వారా తెలంగాణలో బీజేపీ, మజ్లిస్‌ పార్టీలు ఎదగకుండా చేయడమే ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహమని చెబుతున్నారు. శాసనసభను రద్దు చేసిన మరుసటి రోజే ఎన్నికల ప్రచారానికి తెర తీయడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు తనను అందుకోలేనంత దూరంలో నిలబడాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి దాదాపు ఆరు శాతం వరకు ఓటుబ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కనుక

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆ చర్య ఉపకరిస్తుంది. తెలంగాణలో కేసీఆర్‌ విజయం ఖాయమన్న నమ్మకంతోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఆయనకు సహకరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ మద్దతు పొందవచ్చునన్నది వారి ఆలోచనగా ఉంది.

ఈ దశలో పరోక్షంగా బిజెపి, టిఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన ఉంది. అలాగే మజస్లిస్‌ కూడా టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంది. అందువల్ల బిజెపి పెద్దగా ఈ ఎన్నికల్లో లబ్ది పొందలగడం కూడా అసాధ్యమే కానుంది.

Other News

Comments are closed.