బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం

share on facebook

సిద్ధిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండలంలోని సిద్దన్నపేట్‌ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టింది. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నరోత్తంరెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించడం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ఈ ఎన్నికలో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన అన్నారు. ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా సిద్దన్నపేట లో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులుయువకులు 30 మంది జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది. అనంతరం గ్రామంలో భారతీయ జనతాపార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పేరాల తిరుపతిరావుతదితరులు పాల్గొన్నారు

 

Other News

Comments are closed.