బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా

share on facebook

 

ప్రచారంలో నిలదీస్తున్న యెండెల

నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన చేస్తున్నారని, తెరాసను ఓడించి నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని నిజామాబాద్‌ భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఏ ఒక్క హావిూని నెరవేర్చని ఘనత టిఆర్‌ఎస్‌దన్నారు. బిజెపి మద్దతు లేకుండా తెలంగాణ వచ్చేదా అని అన్నారు. తమపార్టీ విపక్షంలో ఉండి ఆనాడు మద్దతు ఇచ్చిందన్న విషయం కెసిరా/- మరచిపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజాం చక్కెర పరిశ్రమని తెరిపిస్తామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమను నడిపించి రైతులకు, కార్మికులకు మంచి రోజులు తీసుకొస్తామని పేర్కొన్నారు. రుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాల పేరిట తెరాస నాలుగున్నరేళ్లు కాలయాపన చేసిందని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. 20 వేల ఇళ్లు అని చెప్పి 300 ఇళ్లు కట్టి వదిలేశారని విమర్శించారు. నగరంలో మజ్లిస్‌ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయని, అధికారులు, పోలీసులను సైతం వారు లెక్కచేయటం లేదన్నారు. తెరాస ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమేనన్నారు. ఎక్కువ రాష్ట్రాలలో భాజపా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని, కేంద్రంలో భాజపా ప్రభుత్వంతో దేశాభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకుంటుందన్నారు. రైతులకు వచ్చిన పంట నష్టపరిహారం నిధులను చెల్లించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూటకో మాట..గంటకో పాట పాడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల నేపద్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాని మోదీ , యూపీ ముఖ్యమంత్రితోపాటు కేంద్రమంత్రుల పర్యటనలు ఉంటాయన్నారు.

 

 

Other News

Comments are closed.