బిజెపి హావిూలు బూటకంగా మారాయి

share on facebook

విశాఖపట్టణం,డిసెంబర్‌20(జ‌నంసాక్షి):  బీజేపీ ప్రభుత్వం నల్లబాబుల పని పడతామని చెప్పి పేదల జీవితాలను నాశనం చేసిందని కాంగ్రెస్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకున్నందునే విభజన బిల్లులో అభివృద్ధికి వేల కోట్లు కేటాయించాలని పొందుపరిచిందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధికి రూ.24,350 కోట్ల రూపాయలను కేటాయించాలని విభజన బిల్లులో పొందుపరిస్తే బీజేపీ ప్రభుత్వం రూ.2000 కోట్లకు కుదించిందని విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ అనేక ప్రాజెక్టులను పూర్తిచేసి ఇక్కడ ప్రజలను ఆదుకున్నదన్నారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని ఓట్లు గడించిన బీజెపీ, టీడీపీల వైఖరి, వారు సాగిస్తున్న పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.  పార్టీ పటిష్ఠానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలన్నారు.

Other News

Comments are closed.