బీమా వివరాలతో పాటు సాగు లెక్కలు

share on facebook

నల్లగొండ,జూన్‌27(జ‌నం సాక్షి): రైతుబీమా కోసం గ్రామాలకు వెళ్లిన అధికారులు పంటల సాగు విరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో వ్యవసాయ భూములు, సాగు లెక్కలు తేల్చే పనిలో వ్యవసాయ విస్తరణాధికారులు నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో రైతుల వారీగా భూములు, పంటల సాగు, నీటి వసతి, బీడు భూముల తదితర వివరాలతో కూడిన నమునాలో వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఏయే పంటలు సాగు చేస్తున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు. బీడు భూమి ఎంత, తదితర అంశాలతో కూడిన పూర్తి సర్వే చేసే పనిలో ఏఈవోలు మునిగిపోయారు. సర్వే పనులను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్నసర్వే పూర్తయితే జిల్లాలో వ్యవసాయ రంగం సమగ్ర స్వరూపం తెలుస్తుంది. జిల్లాలో కొత్తగా నియమించిన ఏఈఓలు క్షేత్రస్థాయిలో కమతాల వారీగా వ్యవసాయ పంటల సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. పక్కా వివరాలను తొందరగా అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఏఈఓలుఆ వివరాలను కిసాన్‌పోర్టులో నమోదు చేయాలి. జిల్లాలో 31 మండలాల్లో సుమారు 16లక్షల జనాభా ఉండగా 3.20లక్షల హెక్టార్ల సాగుభూమి ఉంది. ప్రస్తుతం 2.90లక్షల హెక్టార్ల భూమి సాగవుతుంది. 3.70లక్షల మంది రైతులు జిల్లాలో ఉన్నారు. సాగుకు సంబంధించిన పూర్తి పణాళికలను సిద్ధం చేసేందుకు అవసరమైన కసరత్తు జరుగుతోంది.దీంతో ఎరువులు, విత్తనాలు కేటాయింపులు చేసేందుకు వ్యవసాయ అధికారులకు స్పష్టమైన లెక్క తెలుస్తుంది.నీటి వసతి ఉన్న చోట ఏ మేరకు పంటల సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో స్త్రీ, పురుష నిష్పత్తి, వ్యవసాయ కమతాల సగటు విస్తీర్ణం స్పష్టంగా తెలుస్తాయని, తద్వారా వ్యవసాయానికి అవసరమైన సాయం అందించే చర్యలకు అవకాశం ఏర్పడుతందని భావిస్తున్నారు.ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో వ్యవసాయ సాగు వివరాలను ఏటా రెవెన్యూ సిబ్బందిసేకరిస్తున్నారు. వ్యవసాయశాఖ సిబ్బంది కొరత వల్ల సర్వే చేసినప్పటికి రెవెన్యూ అధికారుల నుంచివివరాలను సేకరిస్తున్నారు. రైతుల లెక్క పక్కాగా లేవకపోవడం వల్ల విత్తనాలు, ఎరువులు ఇతర వ్యవసాయ పరికరాల కేటాయింపులో తక్కువ కావడం, మిగిలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా పక్కాగా ఉండేందుకు పక్కా సర్వే కోసం ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది.

 

Other News

Comments are closed.