బీస్ట్‌ కారును కిమ్‌కు చూపించిన ట్రంప్‌

share on facebook

సింగపూర్‌,జూన్‌12(జ‌నం సాక్షి):

సింగపూర్‌లో జరిగిన కిమ్‌ాట్రంప్‌ భేటీలో ఓ ఘట్టాన్ని ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూసింది. అమెరికా అధ్యక్షుడి కారు ‘బీస్ట్‌’కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా పేరుంది. వీరి భేటీ అనంతరం వర్కింగ్‌ లంచ్‌ను ముగించుకున్న వెంటనే అనుకోని ఘటన ఒకటి చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి అత్యంత శక్తివంతమైన తన కారును కిమ్‌కు స్వయంగా చూపించారు. భోజనాలు ముగిసిన వెంటనే తమ భ్రదతా సిబ్బందితో ట్రంప్‌, కిమ్‌లు పోర్టు కోలో ఉన్న బీస్ట్‌ వద్దకు వచ్చారు. ట్రంప్‌ వెన్నంటి ఉండే ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ కారు తలుపు తీసి లోపల భాగాలను కిమ్‌కు చూపించారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ది బీస్ట్‌(కాడిలాక్‌ వన్‌) సవిూపంలోకి ఎవరినీ రానీయరు. అటువంటిది ఉత్తర కొరియా అధ్యక్షుడికి కారు లోపల భాగాలను కూడా చూపించడం విశేషం. ఎలాంటి సైనిక, రసాయనిక దాడినైనా తట్టుకొనే విధంగా బీస్ట్‌ను డిజైన్‌ చేశారు. ఈ కారు విలువ దాదాపు రూ.10.78 కోట్లు. సాధారణంగా ట్రంప్‌ వంటి దుందుడుకు నాయకుడు ఇంత సుహృద్భావంతో మెలిగారంటే కచ్చితంగా కిమ్‌తో చర్చలు ఆశించిన దానికన్నా మంచి ఫలితాలను ఇచ్చినట్లే భావించాలి. అనంతరం ట్రంప్‌ విలేకర్ల సమావేశం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కిమ్‌ కూడా అత్యంత సురక్షితమైన కారును ఉపయోగిస్తారు. ఆయనకు కూడా ఆయుధాలతో కూడిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌600 కారు ఉంది. దీని విలువ అక్షరాలా 2 మిలియన్‌ డాలర్లు. అంటే ట్రంప్‌ కారు కంటే 0.4మిలియన్‌ డాలర్లు ఎక్కువ ఖరీదైంది.

 

 

Other News

Comments are closed.