బీ ఫారం అందుకున్న సిద్దిపేట టిజెఎస్‌ అభ్యర్థి భవానిరెడ్డి

share on facebook

నేడు భారీ ర్యాలీతో నామినేషన్‌ దాఖలు సిద్దిపేట బ్యూరో, నవంబర్‌ 18: తెలంగాణ జన సమితి సిద్దిపేట అభ్యర్థి మర్కంటి భవానిరెడ్డి ఆదివారం టిజెఎస్‌ అధ్యక్షులు కోదండరాం చేతల మీదుగా పార్టీ బీ ఫారం అందుకున్నారు. సోమవారం ఉదయం సిద్దిపేటలోని అమరవీరు స్థూపం రంగదాంపల్లిలో నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుండి పాత బస్టాండ్‌ మీదుగా మెదక్‌ రోడ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో భవానిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేస్తారు. పోటోరైటప్‌: 255 సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ నియోజక వర్గాల జనరల్‌ అబ్జర్వర్ల నియామాకం సిద్దిపేట బ్యూరో, నవంబర్‌ 18: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, దుబ్బాక నియోజక వర్గాల జనరల్‌ అబ్జర్వర్‌గా గంగాధర్‌ పాత్ర -ఐఏఎస్‌ నియమితులయ్యారు. అలాగే సిద్దిపేట, హుస్నాబాద్‌ నియోజక వర్గాల జనరల్‌ అబ్జర్వర్‌గా డీఎస్‌ గాద్వీ -ఐఏఎస్‌ నియమితులయ్యారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియెజక వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నికలకు సంబందించిన పిర్యాదుల కోసం తమను సంప్రదించాలని వారు కోరారు.

వరవరరావును వెంటనే విడుదల చేయాలి: ఉమ్మడి మెదక్‌ జిల్లా మంజీర రచయితల సంఘం సిద్దిపేట బ్యూరో, నవంబర్‌ 18: వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా మంజీర రచయితల సంఘం ఆదివారం విడుదల చేసి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసారు. రచయితలు, మేధావులు కుట్రదారులు కాదని, ప్రభుత్వమే అసలైన కుట్రదారులని మండిపడ్డారు. అరవై ఏళ్ల సామాజిక ఆచరణ కలిగిన మేధావి వరవరరావును అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. మూడన్నర ఏళ్ల పాటు విద్యార్థులకు అద్యాపకుడిగా, పాతికేళ్ల పాటు తెలుగు సామాజిక సాహిత్య వేదిక సృజన సంపాదకుడిగా, తెలుగు సాహిత్య సాంస్కృతిక మేధో రంగాలను మలుపు తిప్పిన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రజా ఉద్యమ స్వర్గంగా వరవరరావు అందరికీ తెలుసు. చలినెగళ్లు, జీవనాడి, ఊరేగింపు, స్వేచ్చ, సముద్రం, భవిష్యతు చిత్రపటం, ముక్తకంఠం, ఆ రోజులు, ఉన్నదేదో ఉన్నట్లు, మౌనం యుద్దనేరం, అంతస్సూంత్రం, బీజభూమి వంటి కవితా సంపుటాలు, పాటలు ఆయన రచించారు. తెలంగాణ విమోచనోద్యం వంటి ఎన్నో గ్రందాలు, వ్యాసాలు రాసారు. ఇంతటి సామాజిక జీవితం ఉన్న రచయితను దొంగ లేఖలు సృష్టించి ప్రదాని హత్యకు పన్నారనే ఆరోపణ కింద అరెస్టు చేయడం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదు. ఇవాళ సామాజిక కార్యకర్తలను ప్రమాదకర వ్యక్తులుగా చూపెడుతున్న ప్రభుత్వమే వాస్తవానికి ప్రజాస్వామిక వ్యవస్థలను ద్వంసం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా తయారైందని అన్నారు. దీనిని నిలదీసి నిలువరించడం మనందరి కర్తవ్యం, కనక ఈ అరెస్టులకు, చీకటి నిర్బందాలకు వ్యతిరేకంగా గొంతు విప్పమని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, రచయితలకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కోన్నారు.

Other News

Comments are closed.