బుద్వేలులో కర్రలతో దాడిచేసి దారిదోపిడీ

share on facebook

వ్యక్తి నుంచి రూ.6.7 లక్షల నగదు కొట్టేసిన దుండగులు

రంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోనీ బుద్వేలు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్గవి గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న రాము .. ఏజెన్సీ నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై రూ.6.7 లక్షల నగదును తీసుకెళ్తున్నాడు. ఇంతలో దుండగులు అతన్ని అడ్డగించి కర్రలతో దాడికి పాల్పడ్డారు. అతని వద్ద ఉన్న నగదును దోచుకుపోయారు. ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు రాముని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్‌ పోలీసులు 4 బృందాలను రంగంలోకి దించారు. ఈ దోపిడీలో నలుగురు దుండగులు పాల్గొన్నట్టు సమాచారం.

 

Other News

Comments are closed.