బెల్లంపల్లికి చేరుకున్న శ్రవణ్‌ మృతదేహం

share on facebook

మంచిర్యాల,మే4(జ‌నంసాక్షి):  గత నెల 22న అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన శ్రావణ్‌కుమార్‌ మృతదేహం
స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌కు చేరుకుంది. అమెరికాలోని బోస్టన్‌ బీచ్‌లో ప్రమాదవశాత్తు గల్లంతై శ్రావణ్‌కుమార్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. రిచ్‌మండ్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న శ్రావణ్‌.. గత ఆదివారం ఈస్టర్‌ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సవిూపంలోని బీచ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితులందరూ ఆనందంగా గడిపారు. అలలు ఉద్ధృతంగా రావడంతో శ్రావణ్‌ సముద్రంలో కొట్టుకుపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం శ్రావణ్‌ మృతదేహాన్ని బయటకు తీసి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడి శవాన్ని తీసుకుని వచ్చేందుకు స్తానికులు సహకరించారు. శ్రవణ్‌ మృతదేహం స్వగ్రామం రావడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు.

Other News

Comments are closed.