బైకును ఢీకొన్న కంటెయినర్‌: హోంగార్డు మృతి

share on facebook

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి ):కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ¬ంగార్డు మృతిచెందగా.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రామస్వామి తమ సొంత గ్రామం బస్వాపూర్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి కంటైనర్‌ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఇదే ద్విచక్రవాహనంపై ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. రామస్వామి మృతితో బాధిత కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

——

 

Other News

Comments are closed.