బైకును ఢీకొన్న లారీ: తండ్రీ కొడుకుల మృతి

share on facebook

సూర్యాపేట,జూన్‌12(జ‌నం సాక్షి ): చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతులను దురాజ్‌పల్లికి చెందిన భిక్షం, సైదులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనమృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Other News

Comments are closed.