బొలెరో బీభత్సం: ఒకరు మృతి

share on facebook

విశాఖపట్టణం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  విశాఖపట్నం జిల్లా చోడవరంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బొలేరో వాహనం ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి ఆపై రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.  పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Other News

Comments are closed.