బోండా ఉమ భార్యకు నోటీసులు

share on facebook

విజయవాడ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  భూకబ్జా ఆరోపణల కేసులో టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతకు ఆర్డీఓ సోమవారం నోటీసులు జారీ చేశారు. అలాగే ఉమా అనుచరుడు మాగంటి బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి  విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో ఆదేశించారు. స్వాతంత్య సమరయోధుడు సూర్యనారాయణకు చెందిన పదెకరాల స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసినట్లు బొండా ఉమా భార్యపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Other News

Comments are closed.