బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల సమ్మె

share on facebook

లండన్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తమ విమానాలన్నింటినీ రద్దు చేసింది. పైలెట్లు సమ్మె చేస్తుండటంతో విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ చేపట్టిన సమ్మెతో ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. జీతభత్యాల సమస్యను పరిష్కరించడానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. బాల్పాతో చర్చలకు తాము సుముఖంగానే ఉన్నామని ఆ మరోసారి స్పష్టం చేసింది.

Other News

Comments are closed.