భద్రాద్రి జిల్లాలో తెరాసలోకి భారీగా చేరికలు

share on facebook

– పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్‌30(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బూర్గంపాడు మండలం బత్తులనగర్‌ లో 120 కుటుంబాలకు చెందిన న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల కార్యకర్తలు ఇవాళ టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని పాయం అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్‌ వెంటనే మేమున్నామంటూ న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లో చేరినట్లు పాయం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

Other News

Comments are closed.